ఎల్‌నినో ఎదుర్కోవడమెలా? | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో ఎదుర్కోవడమెలా?

May 29 2026 2:19 AM | Updated on May 29 2026 2:19 AM

రానున్న వానాకాలం వ్యవసాయ సీజన్‌లో.. సాధారణానికి 20 నుంచి 25 శాతం తక్కువ వర్షపాతం నమోదు అంచనా స్వల్పకాలిక పంటల సాగును ప్రోత్సహించాలనే పిలుపు పప్పులు, నూనె విదేశాల నుంచి దిగుమతిని అరికట్టేందుకు ..

సాక్షి, ఆదిలాబాద్‌:

రానున్న వానాకాలం వ్యవసాయ సీజన్‌లో సాధారణం కంటే 20 నుంచి 25 శాతం తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో దేశంలో, రాష్ట్రంలో డిమాండ్‌ ఉన్న పంటల సాగుపై ఆయా రాష్ట్రాల్లో వ్యవసాయ యూనివర్సిటీలు అవగాహన చేపడుతున్నాయి. రాష్ట్రంలో డిమాండ్‌ ఉన్నప్పటికీ తక్కువగా సాగవుతున్న స్వల్పకాలిక రకాల పంటలను ప్రోత్సహించాలని పేర్కొంటున్నారు. ఇటీవల ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రాష్ట్రంలోని వ్యవసాయ శాస్త్రవేత్తలకు 3 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో ఈ సీజన్‌లో రైతులను ఏ విధంగా అవగాహనపర్చాలో సూచించారు. దీనికి తోడు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విధంగా దేశ అవసరాలకు ఉపయోగపడే పంటల దిగుబడులను పెంచేందుకు వివిధ రకాల చర్యలు చేపట్టేలా ఈ సీజన్‌లో రైతులను అవగాహన పరిచేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

స్వల్పకాలిక పంటల సాగు పెంచేలా..

దేశ అవసరాలకు మించి వరి, గోధుమ, మొక్కజొన్న, వేరుశనగ, ఆవాలు, చెరుకు వంటి పంటలు గతేడాది రికార్డు స్థాయిలో దిగుబడులు వచ్చినట్లు గుర్తించారు. రాష్ట్రంలో వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, కంది, సోయా చిక్కుడు, వేరుశనగ వంటి పంటలను రెండు సీజన్లలో అధికంగా పండిస్తున్నారు. దీంట్లో ఆహార ధాన్యాల పరంగా చూస్తే కంది మినహాయిస్తే పెసర, మినుములు, అలసంద దిగుబడులు తక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. నూనెగింజల పరంగా చూస్తే వేరుశనగ, నువ్వులు మినహాయిస్తే పొద్దు తిరుగుడు, ఆవాలు, కుసుమ పంటలు తక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నాయి. ఈ నేపథ్యంలో నూనె, పప్పు దినుసులు విదేశాల నుంచి దిగుమతిని తగ్గించుకునే దిశగా దేశంలో చర్యలు ఉండాలన్న మోదీ పిలుపు మేరకు ఈసారి జిల్లాలో స్వల్పకాలిక పంటలైన పెసర, మినుము, అలసంద, పొద్దు తిరుగుడు, ఆవాలు, కుసుమ పంటల సాగు విస్తీర్ణం పెంచాలని శాస్త్రవేత్తలు రైతులను చైతన్య పరుస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే అనేక కాార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ వానాకాలం సీజన్‌లో జిల్లా పరంగా చూస్తే రైతులు పత్తి విస్తీర్ణం తగ్గించి డిమాండ్‌ ఉన్న పంటపలు సాగు చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ప్రభావం ఇలా..

రానున్న వానాకాలంలో దేశంలో, రాష్ట్రంలో సాధారణం కంటే 20 నుంచి 25 శాతం తక్కు వ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శా ఖ చెబుతోంది. జూన్‌, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో లోటు వర్షపా తం ఉంటుందని, దీని కారణంగా దీర్ఘకాలిక పంటలపై తీవ్ర ప్రభావం ఉంటుందని అంటున్నారు. స్వల్పకాలిక పంటల సాగు, తక్కువ నీటితో సాగయ్యే పంటలు, తక్కువ ఎరువుల వినియోగం జరిగే పంటలను రైతులు సాగు చేయాలని సూచిస్తున్నారు.

కారణాలిలా..

నత్రజని మినహాయిస్తే మిగతా ఎరువులను అధికంగా విదేశాల నుంచి దిగుమతి చేస్తున్నట్లుగా వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. స్వల్పకాలిక పంటల సాగును ప్రోత్సహించిన పక్షంలో ఎరువుల వినియోగం గణనీయంగా తగ్గిపోనుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా రైతులకు లాభసాటిగా ఉండటంతో పాటు దేశ అవసరాలకు ఉపయోగపడే పంటలను ఉత్పత్తి చేయడం ద్వారా డిమాండ్‌ పొందవచ్చనేది శాస్త్రవేత్తల అభిప్రాయం.

మినుములు

Advertisement
 
Advertisement
Advertisement