నేడు బక్రీద్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు బక్రీద్‌

May 28 2026 1:40 AM | Updated on May 28 2026 1:40 AM

● మసీదులు, ఇద్గాలు ముస్తాబు ● ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు

ఉట్నూర్‌రూరల్‌/కెరమెరి/నెన్నెల: ఇస్లాం ప్రకారం ముస్లింలకు ముఖ్యమైన పండుగల్లో బక్రీద్‌ రెండోది. ఇ బ్రహీం చేసిన నిరుపమాన త్యాగానికి ప్రతీకగా ఏటా ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మసీదులు, ఈ ద్గాలు ముస్తాబు చేశారు. గురువారం బక్రీద్‌ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు ఏర్పాట్లు చే శారు. ఇస్లామిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఈ నెలలో 10 వ రోజున బక్రీద్‌ పండుగను ఇబ్రహీం త్యాగాన్ని త లుచుకుంటారు. ఇదే రోజు మక్కా నగరంలో హజ్‌ ఆరాధనోత్సవం జరుగుతుంది. మక్కా వెళ్లే స్థోమత లేని వారు ఉన్న చోటే ప్రత్యేక నమాజ్‌ చేసి ఖుర్బానీ ఇస్తారు. కాగా, బుధవారం జిల్లా కేంద్రాలతోపాటు మున్సిపాల్టీలు, మండలాల్లో ఈద్గా వద్ద ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు.

పటిష్ట బందోబస్తు

ఆదిలాబాద్‌టౌన్‌: బక్రీద్‌ పండుగ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానాన్ని పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌ రెడ్డి, సీఐలు మోహన్‌, నాగరాజు, ప్రణయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కేంద్రంలో పోలీసుల ఫ్లాగ్‌మార్చ్‌

ప్రజల్లో పోలీసులపై నమ్మకం, భద్రతా భావన పెంపొందించేందుకు జిల్లా కేంద్రంలో ఫ్లాగ్‌ మార్చ్‌ ని ర్వహించినట్లు డీఎస్పీ జీవన్‌ రెడ్డి తెలిపారు. వన్‌టౌ న్‌, టూటౌన్‌ స్టేషన్ల పరిధిలో సుమారు 50 మంది పోలీసు సిబ్బందితో ఈ ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ బక్రీ ద్‌ పండుగను ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఇందులో వన్‌టౌన్‌ సీఐ సునీల్‌ కుమార్‌, టూటౌన్‌ సీఐ నాగరాజు, ఎస్సై సంజయ్‌, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement