ఉట్నూర్‌రూరల్: ఉట్నూర్ ఐటీడీఏ పీవో మందా మకరందు మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్‌ను హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలిశా రు. గిరిజన సంక్షేమానికి సంబంధించిన ప్రస్తు త పరిస్థితులు, ఐటీడీఏ పరిధిలో అభివృద్ధి కా ర్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికల పై విస్తృతంగా చర్చించారు. గిరిజన ప్రాంతా ల్లో విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాల మెరుగుదల, మౌలిక సదుపాయాల విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.


