పేపర్‌ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

పేపర్‌ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం

Apr 17 2026 10:56 AM | Updated on Apr 17 2026 10:56 AM

పేపర్‌ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం

సంతనూతలపాడు( చీమకుర్తి రూరల్‌): స్థానిక మద్దులూరు రోడ్డులో ఖాళీ పేపర్‌ ఇండస్ట్రీలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించినది. కొందరు గుర్తు తెలియని ఆకతాయిలు వల్ల ఈ కాళీ గూడెంకు అగ్నిప్రమాదం జరిగినట్టు స్థానికులు భావిస్తున్నారు. గోదాములో చెల రేగుతున్న మంటలపై స్థానికులు సంతనూతలపాడు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వేజెండ్ల అజయ్‌ బాబు దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక పోలీసులు గోడం తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. వెంటనే అగ్ని ప్రమాద నివారణకు చర్యలు చేపట్టారు. ఒంగోలు అగ్నిమాపక శాఖకు చెందిన జిల్లా అసిస్టెంట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ రెడ్డితో కూడిన బృందం అగ్ని ప్రమాద ప్రాంతానికి విచ్చేసి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement