ఆదిలాబాద్: దివ్యాంగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరపాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్‌లో అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. నెలవారీ పెన్షన్‌ను పెంచాలని, దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ తక్షణమే మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, కాగజ్‌నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, దివ్యాంగుల సంఘం రాష్ట్ర నాయకులు ముస్తాపూర్ అశోక్, తదితరులు పాల్గొన్నారు.


