నేర పరిశోధనలో సీసీ నిఘా కీలకం | - | Sakshi
Sakshi News home page

నేర పరిశోధనలో సీసీ నిఘా కీలకం

Mar 25 2026 7:22 AM | Updated on Mar 25 2026 7:22 AM

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: నేర పరిశోధనలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ సమావేశ మందిరంలో పోలీసు అధికారులతో మంగళవారం నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపే దిశగా విధులు నిర్వర్తించాలన్నారు. స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతీ గ్రామానికి కేటాయించిన వీపీవో ద్వారా సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలన్నారు. గంజాయి, గుడుంబా, మాదకద్రవ్యాలు, గ్యాంబ్లింగ్‌ వంటివి జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆన్‌సైడ్‌ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని, రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, స్టేషన్‌లో నెలరోజుల పరిధిలో నమోదైన కేసుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నిందితులకు కోర్టులో శిక్ష పడేలా చూడాలన్నారు. వివిధ పోలీసు స్టేషన్లలో ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇందులో అదనపు ఎస్పీలు సురేందర్‌ రావు, మౌనిక, రుత్విక్‌ సాయి, శిక్షణ ఐపీఎస్‌ రాహుల్‌ కాంత్‌, డీఎస్పీ పోతారం శ్రీనివాస్‌, ఎల్‌.జీవన్‌ రెడ్డి, సీఐలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement