పునర్విభజనతో మారనున్న రాజకీయ ముఖచిత్రం ఉమ్మడి జిల్లాలో కొత్తగా మరో ఐదు శాసనసభ స్థానాలు లోక్‌సభ నియోజకవర్గ స్థానాల్లోనూ మార్పులు 2011జనాభా ప్రాతిపదికన కేంద్రం కసరత్తు 2029లో ఎస్సీ, ఎస్టీ, మహిళా, జనరల్ రిజర్వు స్థానాల్లో ఎన్నికలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అసెంబ్లీ, లోక్‌సభ స్థా నాల పునర్విభజన(డీ లిమిటేషన్)పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 2029లో జరిగే ఎన్నికల నాటికి శాసనసభ, లోక్‌సభ స్థానాలు పెంచాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం మొదలైన జనగణన ప్రక్రియ ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. దీంతో 2011 జనాభా ప్రాతిపదికనే కొత్త స్థానాలు పెంచేందుకు ప్రణాళికలు సాగుతున్నా యి. నాటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో మరో ప్రస్తు తం ఉన్న 119 శాసనసభ స్థానాలకు మరో సగం శాతం అంటే 60వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ప్రస్తు తం ఉన్న పది శాసనసభ స్థానాలకు మరో ఐదు స్థానాలు పెరిగి మొత్తం 15 స్థానాలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి శాసనసభ్యుల సంఖ్య పెరగనుంది.
రిజర్వు స్థానాల్లో మార్పులు
కొత్త స్థానాల ఏర్పాటుతో ఉమ్మడి జిల్లా ముఖ చిత్రమే పూర్తిగా మారిపోనుంది. 2009 చివరలో నియోజకవర్గాల పునర్విభజనలో కేవలం సర్దుబాటు చేయగా, రిజర్వేషన్లు మాత్రమే మారాయి. కానీ సంఖ్యలో మార్పు రాలేదు. తాజాగా 15 స్థానాలకు చేరితే చట్టసభలకు ప్రజాప్రతినిధుల సంఖ్య మరింత పెరగనుంది. ఇక కొత్తగా ఏర్పాటయ్యే స్థానాల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, జనరల్ స్థానాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 ప్రకారం అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో 33శాతం మహిళలకు రిజర్వు చేయాల్సి ఉంది. జిల్లా యూనిట్‌గా ఎస్టీ జనాభా ఆ వర్గాలకు స్థానాల రిజర్వు జరగనుంది. ఎస్సీ స్థానాలకు రాష్ట్ర యూనిట్‌గా రిజర్వు అయ్యే అవకాశం ఉంది. ఇక మహిళా రిజర్వేషన్ రాష్ట్ర, జిల్లా జనాభా ప్రాతిపదికన ఇస్తారా? లేక లాటరీ ప్రాతిపదికన కేటాయిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
ఎక్కడెక్కడ కొత్తవి?
ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లా కేంద్రాలైన అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనే అత్యధిక జనాభాతో ఉన్నాయి. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల పరిధి మండలాలను కలుపుతూ మళ్లీ కొత్తగా స్థానాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్‌తోపాటు విస్తీర్ణంలో పెద్దదైన బోథ్ స్థానం, ఖానాపూర్ పరిధి ఏజెన్సీ ఉట్నూర్‌లో మార్పు జరగనుంది. మంచిర్యాల నియోజకవర్గ పరిధి నగర ప్రాంతం, గ్రామీణ ప్రాంతాలైన లక్సెట్టిపేట, ఇక ఆసిఫాబాద్, సిర్పూర్ రెండు నియోజకవర్గాల పరిధి మండలాల్లోనూ కొత్తగా ఒక స్థానం ఏర్పడనుంది.
రాష్ట్రం యూనిట్‌గా లోక్‌సభ స్థానాలు
మరో వైపు రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా, మరో తొమ్మిది పెరగనున్నాయి. అయితే రాష్ట్ర స్థాయి జనాభా యూనిట్‌గా లోక్‌సభ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఆదిలాబాద్(ఎస్టీ), పెద్దపల్లి(ఎస్సీ) ఎంపీ స్థానాలతోపాటు మరోస్థానం కొత్తగా ఏర్పాటవుతుందా? లేదా? అనేది డీలిమిటేషన్ ప్రక్రియ మొదలైతేనే స్పష్టత రానుంది.
కొత్త జిల్లాల ప్రకారమే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. దీంతో భౌగోళికంగా నియోజకవర్గాలు వేర్వేరు జిలాల్లో కాకుండా ఒకే జిల్లాలోనే ఉండనున్నాయి. 2016లో కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉమ్మడి జిల్లాలోని పది స్థానాలు అటు ఇటుగా మారాయి. ఆదిలాబాద్ జిల్లా పరిధిలో పూర్తిగా స్థాయి ఆదిలాబాద్, బోథ్‌లు ఉండగా, ఆసిఫాబాద్ నియోజకవర్గం నార్నూర్, గాదిగూడ మండలాలు ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో నిర్మల్, ముథోల్ ఉండగా, పాక్షికంగా ఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి, దస్తూరాబాద్, కడెం మండలాలు ఉన్నాయి. మిగతా ఉట్నూరు, ఇంద్రవెల్లి మండలాలు ఆదిలాబాద్ జిల్లాలో, జన్నారం మండలం ఒక్కటి మంచిర్యాల జిల్లాలో ఉంది. ఇక మంచిర్యాల జిల్లా పరిఽధిలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు పూర్తి స్థాయిలో ఉన్నాయి. ముథోల్, సిర్పూర్ నియోజకవర్గాల పరిధిలో గ్రామాలు సైతం పక్క జిల్లాల్లో ఉన్నాయి. దీంతో పాలనలో ఇబ్బందులు రాకుండా ఒకే జిల్లా పురిధిలోనే నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యేలా కసరత్తు జరుగుతన్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లా అసెంబ్లీ స్థానాలు
జిల్లా 2011 జనాభా పాతవి కొత్తగా ఏర్పడేవి
ఆదిలాబాద్ 7,08,972 02 02
కుమురంభీం 5,15,812 02 01
మంచిర్యాల 8,07,037 03 01
నిర్మల్ 7,09,418 03 01


