తాంసి: ఆదిలాబాద్‌ను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా భీంపూర్ పీహెచ్‌సీలో మంగళవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం నిర్వహించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రచార వాహనాన్ని అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం వ్యాధిగ్రస్తులకు కళావతి పౌండేషన్ ఆధ్వర్యంలో నిక్షయ్ మిత్ర కిట్‌లు పంపిణీ చేశారు. వ్యాధి నియంత్రణకు కృషి చేస్తున్న ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటికే 24 గ్రామాలను టీబీ రహితంగా ప్రకటించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి మరిన్ని గ్రామాలు ఈ జాబితాలో చేరేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్యాధికారులు సాధన, మనోహర్, టీబీ ప్రోగ్రాం జిల్లా అధికారి సుమలత, తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు రంజన, కేశవ్, లక్ష్మి, మండల వైద్యాధికారి నిఖిల్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
గిరిజన ఆశ్రమ పాఠశాల తనిఖీ
మండలంలోని అందర్‌బంద్ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రమేశ్,వైద్యసిబ్బంది, తదితరులు ఉన్నారు.


