షార్ట్‌సర్క్యూట్‌తో సామగ్రి దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌సర్క్యూట్‌తో సామగ్రి దగ్ధం

Mar 25 2026 7:10 AM | Updated on Mar 25 2026 7:10 AM

తాంసి: మండలంలోని పొన్నారిలో మంగళవారం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఇంట్లోని సామగ్రి దగ్ధమైంది. దేవల్ల ఓమక్క ఇంట్లో ఫ్రిజ్‌ వద్ద షార్ట్‌ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో నుంచి భారీగా పొగలు రావడంతో కుటుంబసభ్యులు బయటకు వచ్చి అప్రమత్తమయ్యారు. స్థానికులు బిందెలతో నీళ్లుచల్లి మంటలు ఆర్పివేశారు. అప్పటికే ఫ్రిజ్‌తో పాటు ఇంట్లోని బట్టలు, నిత్యావసర వస్తువులు కాలిపోయాయి. ఘటనలో రూ.లక్ష మేర ఆస్తినష్టం జరిగిందని బాధితురాలు వాపోయింది. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement