సీఎం కప్‌ విజేతలకు కలెక్టర్‌ అభినందన | - | Sakshi
Sakshi News home page

సీఎం కప్‌ విజేతలకు కలెక్టర్‌ అభినందన

Mar 24 2026 7:49 AM | Updated on Mar 24 2026 7:49 AM

కై లాస్‌నగర్‌: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన రెండో ఎడిషన్‌ సీఎం కప్‌ క్రీడా పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచారు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ పారామీటర్ల ఆధారంగా నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా క్రీడాకారులు అత్యధికంగా 82 పాయింట్లు సాధించి రాష్ట్రంలో ప్రథమస్థానం కై వసం చేసుకున్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో క్రీడాకారులకు కలెక్టర్‌ రాజర్షిషా మెడల్స్‌ అందజేసి అభినందించారు. ఇందులో అదనపు కలెక్టర్‌ ఎస్‌.రాజేశ్వర్‌, డీవైఎస్‌వో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement