నేరడిగొండ: నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని బోథ్ ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని ప్రధానరోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. బోథ్‌లో బీటీ రోడ్లు, సీసీ రింగ్ రోడ్డు, వీధిదీపాల నిర్మాణానికి రూ.5 కోట్లు, పొచ్చర ఎక్స్ రోడ్డు నుంచి బోథ్ పట్టణం వరకు ఫోర్ లేన్, సెంట్రల్ లైటింగ్, మైనర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.38 కోట్లు, ఇచ్చోడలో ఫోర్‌లేన్ పనుల్లో భాగంగా సైడ్ డ్రెయిన్ నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపాదించిన రోడ్ల పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఈఎన్‌సీకి సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మంత్రి అజారుద్దీన్‌ను కలిసిన ఎమ్మెల్యే
ఇచ్చోడ: మంత్రి అజారుద్దీన్‌ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇచ్చోడ మండల కేంద్రంలో షాదీఖానా కోసం రూ.3 కోట్ల 65లక్షల నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రికి వినతి పత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే వివరించారు.


