బాసర: గోదావరి నదిలో బాసర వద్ద ఆదివారం రెండు మృతదేహాలు లభ్యమైన ఘటన కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికులు బాసర బ్రిడ్జి కింద గోదావరిలో తేలియాడుతున్న రెండు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. ఒక మృతదేహం నిజామాబాద్ జిల్లా కేంద్రం గాజులపేటకు చెందిన వ్యక్తిదిగా గుర్తించారు. లభ్యమైన మహిళ మృతదేహం వివరాలు ఇంకా తెలియరాలేదని బాసర సీఐ కిరణ్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.


