దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్‌

Mar 23 2026 8:24 AM | Updated on Mar 23 2026 8:24 AM

లక్ష్మణచాంద: సోన్‌ మండలం కడ్తాల్‌ గ్రామ శివారులో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సోన్‌ ఎస్సై గోపి పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్‌ పట్టణానికి చెందిన ఎలుగు సుధాకర్‌ జనవరిలో తన బైక్‌ని కడ్తాల్‌ గ్రామ శివారులో పార్క్‌ చేసి పని నిమిత్తం వెళ్లగా కుచంపల్లి లక్ష్మణ్‌ బైక్‌ని దొంగతనం చేశాడు. ఎలుగు సుధాకర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై గోపి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈక్రమంలో లక్ష్మణ్‌ని ఆదివారం గంజల్‌ టోల్‌ప్లాజా వద్ద పట్టుకొని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పు కున్నాడు. అతని వద్ద నుంచి మూడు మో టార్‌ సైకిల్‌లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు. లక్ష్మణ్‌ ఇప్పటికే ఆరు కేసులలో నిందితుడిగా ఉన్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఏఎస్సై దేవన్న, పీసీలు రాజు, వినోద్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement