మంచిర్యాలక్రైం: సెల్‌ఫోన్ విషయంలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసిన ఘటన జిల్లాకేంద్రంలో చోటు చేసుకుంది. సంబంధిత వివరాలను సీఐ ప్రమోద్ రావు ఆదివారం వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన దీపక్(35), భీమిని సంజీవ్, కాసిపేట మండలం సిడం దీపక్‌లు జిల్లా కేంద్రంలోని చిందం శ్రీనివాస్ అనే బిల్డర్ వద్ద కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 19న జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో దీపక్, సంజీవ్, సిడం దీపక్‌లు రాత్రి మద్యం తాగుతుండగా సెల్‌ఫోన్ విషయంలో గొడవ పడ్డారు. ఈక్రమంలో సంజీవ్, సిడం దీపక్‌లు దీపక్‌ను రాడుతో తలపై మోదీ హత్య చేశారు. నిందితులు సంజీవ్, సిడం దీపక్‌లను ఆదివారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చి 14 రోజుల రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.


