భూసేకరణ అంశమే లేదు.. | - | Sakshi
Sakshi News home page

భూసేకరణ అంశమే లేదు..

Mar 21 2026 5:05 AM | Updated on Mar 21 2026 5:05 AM

బడ్జెట్‌పై మిశ్రమ స్పందన

జిల్లాకు ప్రత్యక్ష కేటాయింపుల్లో మొండి చెయ్యి

రాష్ట్ర పథకాల్లో దక్కనున్న ప్రయోజనం

సంక్షేమానికి పెద్దపీట అంటున్న కాంగ్రెస్‌

అంకెల గారడీగా విమర్శిస్తున్న ప్రతిపక్షాలు

వరంగల్‌ విమానాశ్రయం కోసం భూసేకరణ పూర్తి చేసి నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం.. ఆదిలాబాద్‌ విమానాశ్రయ మాస్టర్‌ ప్లాన్‌ తుది దశలో ఉందని భట్టి వివరించారు. ఈ నేపథ్యంలో భూసేకరణ అంశం ఇప్పట్లో లేనట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాస్టర్‌ ప్లాన్‌ తర్వాతే ఈ అంశంలో ముందడుగు పడే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇక జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులు కొరటా–చనాఖా బ్యారేజ్‌, పిప్పల్‌కోటి రిజర్వాయర్లకు సంబంధించి ఆశించిన స్థాయిలో నిధులు విడుదల కాలేదు. ఇక కుప్టి ప్రాజెక్ట్‌కు సంబంధించి నామమాత్రంగా నిధులు కేటాయించడం గమనార్హం.

సాక్షి,ఆదిలాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. జిల్లాకు ప్రత్యక్ష కేటా యింపుల్లో మొండి చెయ్యి ఎదురైందన్న అభిప్రా యం ఎక్కువగా వినిపిస్తోంది. అయితే వివిధ పథకాల ద్వారా జిల్లాకు కూడా ప్రయోజనం దక్కనుండడం కొంత ఊరటనిచ్చే అంశం. మరోవైపు ఈ బ డ్జెట్‌ సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసిందని అధి కార కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయ పడుతుండగా.. అంకెల గారెడీగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఎయిర్‌పోర్ట్‌ నిధుల కేటాయింపుపై నిరాశ

2026–27 బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. జిల్లాకు సంబంధించి ఎయిర్‌పోర్టు భూసేకరణకు నిధుల కేటాయింపు విషయంలో అనేక ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆ ప్రస్తావన లేకపోవడం నిరాశ కలిగించింది. పెండింగ్‌ ప్రాజెక్టులకు స్వల్ప నిధుల కేటాయింపులు జరిపారు. దీంతో ఆ పథకాలు నిర్మాణం పూర్తి దాల్చడం అనుమానంగానే కనిపిస్తోంది.

రాష్ట్ర పథకాల ద్వారా ప్రయోజనం..

ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాను రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. రూ.5లక్షల వరకు బీమా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2న విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్‌ అమలు పర్చనున్నట్లు పేర్కొన్నారు. ఇది జిల్లాలోని అనేక మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చనుంది. ఇక ప్రతీ ఉద్యోగికి డిజిటల్‌ హెల్త్‌ కార్డు ఇవ్వనున్నట్లుగా వెల్లడించారు. కొత్తగా పెన్షన్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి తీపి కబురు అందించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారికి అందజేస్తామని పేర్కొన్నారు. రైతు భరోసాకు నిధులు కేటాయించారు. ఈనెల 22 నుంచి అవసరమైన నిధులు విడుదల చేయనున్నట్లుగా ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. అలాగే ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకం, సన్నబియ్యానికి బోనస్‌, గృహజ్యోతి, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, గ్యాస్‌ సిలిండర్‌ సబ్సిడీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు నిధులు కేటాయించింది. ఐటీఐ, ఏటీసీలలో చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ అందజేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 274 మొబైల్‌ అంగన్‌వాడీలను ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్‌లో పొందుపర్చింది.

రాష్ట్ర పథకాల్లో జిల్లాకు ప్రయోజనం ఇలా..

పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్‌:

58,943 మంది విద్యార్థులకు

జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం :

6,050 మంది విద్యార్థులకు

మోడల్‌ స్కూళ్లలో : 800 మంది విద్యార్థులకు

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా :

1,56,683 (2011 జనాభా లెక్కల ప్రకారం)

ప్రాజెక్టులకు కేటాయింపులు..

కుప్టి : రూ.50 లక్షలు

లోయర్‌ పెన్‌గంగ : రూ.177.54 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement