నేడే రంజాన్‌ | - | Sakshi
Sakshi News home page

నేడే రంజాన్‌

Mar 21 2026 5:05 AM | Updated on Mar 21 2026 5:05 AM

వాతావరణం ● ముస్తాబైన ఈద్గాలు, మసీదులు

వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ ప్రభావం కనిపిస్తుంది. గాలిలో తేమశాతం పెరగనుంది.

ఆదిలాబాద్‌: రంజాన్‌ ఉపవాస దీక్షలు శుక్రవారంతో ముగిశాయి. సాయంత్రం ఆకాశంలో నెలవంక దర్శనమివ్వడంతో శనివారం ఈద్‌ ఉల్‌ ఫితర్‌ను జరుపుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. జిల్లాలోని ఈద్గాలు, మసీదులను ముస్తాబు చేశారు. ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

పటిష్ట బందోబస్తు..: ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

రంజాన్‌ పురస్కరించుకుని జిల్లాకేంద్రంలోని ఈద్గా మైదానం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. ఈద్గా మైదానా న్ని శుక్రవారం సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పట్టణంలోని ప్రధాన ఈద్గాతో పాటు అన్ని మసీదులు, ముఖ్యమైన కూడళ్ల వద్ద ప్రత్యేక పికెట్స్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సుమారు 250 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శుక్రవారం రాత్రి నుంచే నిఘా పెంచుతున్నామని తెలిపారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. శనివారం ఉదయం ఈద్గా మైదానం వద్ద ప్రార్థనలు జరిగే సమయంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని, పట్టణ ప్రజలు అంతర్గత రోడ్లను, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని కోరా రు. ఆయన వెంట డీఎస్పీ ఎల్‌. జీవన్‌ రెడ్డి, పట్టణ సీఐలు బి. సునీల్‌ కుమార్‌, కె. నాగరాజు, ప్రణయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ముస్లింలకు కలెక్టర్‌ శుభాకాంక్షలు

కైలాస్‌నగర్‌: పవిత్ర రంజాన్‌ పురస్కరించుకుని జిల్లాలోని ముస్లింలకు కలెక్టర్‌ రాజర్షి షా ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement