జనగణన పకడ్బందీగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

జనగణన పకడ్బందీగా చేపట్టాలి

Mar 21 2026 5:05 AM | Updated on Mar 21 2026 5:05 AM

● కలెక్టర్‌ రాజర్షి షా

కై లాస్‌నగర్‌: జనగణన ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ రాజర్షిషా అధి కారులను ఆదేశించారు. సెన్సస్‌–2027 నిర్వహణ పై టెక్నికల్‌ అసిస్టెంట్లు, చార్జ్‌క్లర్కులకు స్థానిక టీటీడీసీలో మూడు రోజుల శిక్షణ తరగతులను శు క్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్‌ విధానంలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందుకోసం సెన్సస్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ వంటి ప్రత్యేక యాప్‌ లు, పోర్టల్స్‌ అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ కింద ఏప్రిల్‌ 26 నుంచి మే 10 వరకు ప్రజలు స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపా రు. హౌస్‌ లిస్టింగ్‌, హౌసింగ్‌ సెన్సస్‌ కింద మే 11 నుంచి జూన్‌ 9 వరకు ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో ఇళ్ల జాబితా నమోదు ప్రక్రియ చేపడతారని అ న్నారు. ఇందులో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, కలెక్టరేట్‌ పర్యవేక్షకురాలు నలందప్రియ, మాస్టర్‌ ట్రైనర్లు వినయ్‌, జగన్‌, శ్రీహరి పాల్గొన్నారు.

యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

జిల్లా కేంద్రంలోని టీటీడీసీ భవనంలో తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్‌ రాజర్షి షా శుక్రవారం ప్రారంభించారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన టెక్నికల్‌,నాన్‌–టెక్నికల్‌ కో ర్సుల్లో ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా, ఈడీఎం రవి, టాస్క్‌మేనేజర్‌ సాయి, బోధన సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరు

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భా గంగా పట్టణంలోని 33వ వార్డులో ఇందిరమ్మ ఇంటి ప్రవేశానికి కలెక్టర్‌ హాజరయ్యారు. రొడ్డ వాసవి–రవి దంపతులు నిర్మించుకున్న ఇంటిని ఆయన ప్రారంభించారు.కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రాజు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, పాల్గొన్నారు.

‘ఉపాధి’లక్ష్యాలు గడువులోపు పూర్తి చేయాలి

ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావే శ మందిరంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ మెటీరియల్‌ వ్య యం, వివిధ పెండింగ్‌ పనుల పురోగతిపై సమీక్షించారు. పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. ఇందులో డీఆర్డీవో రవీందర్‌ రాథోడ్‌, పంచాయతీరాజ్‌ ఈఈ రాథోడ్‌ శివరాం, ఏఈఈలు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి

ఆదిలాబాద్‌టౌన్‌: మెడికల్‌ క్యాంపుల్లో అందించే వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్థానిక శాంతినగర్‌ పీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని శుక్రవారం సందర్శించారు. అవసరమైన వారికి మెరుగైన చికిత్స కోసం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజు, కౌన్సిలర్లు మౌనిక, సయ్యద్‌ మెహబూబ్‌, సుచిత, జ్యోతి, నర్మదా, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement