ఆదిలాబాద్‌టౌన్: జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించడంపై లెక్చరర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. జిల్లా కేంద్రంలోని మూల్యాంకన కేంద్రంలో తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. డీఐఈవో జాదవ్ గణేశ్ కుమార్ మాట్లాడు తూ, పథకం అమలుతో పేద విద్యార్థులకు మేలు చేకూరుతుందన్నా రు. ఇందులో చట్ల ప్రవీణ్‌కుమార్, గోవర్ధన్, అశోక్, రవికాంత్, నరేశ్, సురేశ్, నరేందర్‌రెడ్డి, ఐలయ్య, అనిల్, రమేశ్ పాల్గొన్నారు.


