కై లాస్‌నగర్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండే ళ్లు దాటినా హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎంపీ గోడం నగేశ్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హా మీలను అమలు చేయాలనే డిమాండ్‌తో పార్టీ రా ష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ ఎ దుట నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ రాజ ర్షి షాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, రైతు భరోసా ఇవ్వని కారణంగా అన్నదాతలు పెట్టుబడికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మనంద్ తదితరులు పాల్గొన్నారు.


