● క్షే త్రస్థాయిలో అధికారుల పరిశీలన● నీటి ఎద్దడి ఉన్న గ్రామాల గుర్తింపు ● ఈ నెల 28 వరకు స్పెషల్‌ డ్రైవ్‌ ● సమస్య పరిష్కారం దిశగా చర్యలు | - | Sakshi
Sakshi News home page

● క్షే త్రస్థాయిలో అధికారుల పరిశీలన● నీటి ఎద్దడి ఉన్న గ్రామాల గుర్తింపు ● ఈ నెల 28 వరకు స్పెషల్‌ డ్రైవ్‌ ● సమస్య పరిష్కారం దిశగా చర్యలు

Feb 20 2026 6:47 AM | Updated on Feb 20 2026 6:47 AM

● క్ష

● క్షే త్రస్థాయిలో అధికారుల పరిశీలన● నీటి ఎద్దడి ఉన్న గ

● క్షే త్రస్థాయిలో అధికారుల పరిశీలన● నీటి ఎద్దడి ఉన్న గ్రామాల గుర్తింపు ● ఈ నెల 28 వరకు స్పెషల్‌ డ్రైవ్‌ ● సమస్య పరిష్కారం దిశగా చర్యలు

కైలాస్‌నగర్‌: వేసవి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతా ల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యే క దృష్టి సారించింది. తాగునీటి సమస్య ఎదురయ్యే గ్రామాలను ముందస్తుగా గుర్తించాలని అధికారులను ఆదేశించింది. ఇందుకోసం ఈ నెల 1నుంచి 28వ తేదీ వరకు జిల్లాలోని అన్ని హ్యాబిటేషన్లలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభు త్వ ఆదేశాలకు అనుగుణంగా రంగంలోకి దిగి న అ ధికారులు క్షేత్రస్థాయిలో పరిశీ లన జరుపుతున్నారు. తమ పరిధిలోని ప్రతీ హ్యాబి టేషన్‌ను సందర్శి స్తూ గతేడాది వేసవిలో తలెత్తిన నీటి ఇబ్బందులను గుర్తిస్తున్నారు. ఈ వేసవిలో సమస్య తలెత్తే గ్రామాలను అంచనా వేయడంతో పాటు సమస్యకు కారణమయ్యే అంశాలను గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 421 హ్యాబిటేషన్లలో పరిశీలన పూర్తయింది. గ డువు సమీపిస్తుండడంతో ప్రక్రియను మరింత ము మ్మరం చేసేలా ముందుకు సాగనున్నారు. జిల్లా యంత్రాంగం గుర్తించి అందించే నివేదికల ఆధారంగా సర్కారు ప్రత్యేకనిధులు విడుదల చేయనుంది.

కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు రంగంలోకి దిగారు. ఎంపీడీవో, ఎంపీవో, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ, పంచాయతీ కార్యదర్శి లాంటి న లుగురు అధికారులతో కూడిన బృందాలు ఆయా మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నాయి. తమ పరిధిలోని ప్రతీ ఆవాసాన్ని బృందం సభ్యులు సందర్శిస్తున్నారు. అక్కడి నీటి వనరులు, మిషన్‌ భగీ రథ నీటి సరఫరా జరుగుతుందా, ఎప్పటివరకు నీరు సరఫరా అవుతుందనే వివరాలు ఆరా తీస్తున్నారు. నీటి సమస్య ఎప్పటి నుంచి ఏర్పడుతుంద నే దానిపై వివరాలు తెలుసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 421 హ్యాబిటేషన్లను సందర్శించిన అధికారులు పలు సమస్యలు గుర్తించారు. 48 చేతి పంపులకు మరమ్మతులు చేపట్టాల్సిన అవసరముందని, 35 హ్యాబిటేషన్లలో నీటి సమస్య జఠిలమమయ్యే పరిస్థితులు ఉన్నాయని, 51 చోట్ల పైపులైన్లకు లీకేజీలు ఏర్పడుతున్నాయ ని గుర్తించారు. 36 సింగిల్‌ ఫేజ్‌ మోటర్లు, ఆరు పీడబ్ల్యూడీ మోటర్లు ఆరు చో ట్ల మరమ్మతులు చేయాల్సి న అవసరముందని నిర్ధారించారు. 20 గ్రామాల్లో చేదబా వుల్లో నీరున్నా నిరుపయోగమైనట్లు గుర్తించారు. ఈ నెలాఖరు వరకు ఈ స్పెషల్‌ డ్రైవ్‌ పూర్తి చేసి సమస్యలు తలెత్తే గ్రామాలు, అందుకు గల కా రణాలను గుర్తిస్తూ సమస్యను ని యంత్రించేందుకు చేపట్టాల్సిన చ ర్యలతో కూడిన నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తే నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక నిధులు ప్రభుత్వం విడుదల చేయనుంది. మార్చి మొదటి వారంలోనే ఈ నిధులు విడుదలయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తద్వారా ముందస్తుగా చర్యలు చేపట్టి ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టనున్నారు.

గ్రామ

పంచాయతీలు

473

మొత్తం

అవాస

ప్రాంతాలు

1,239

ఓపెన్‌ వెల్స్‌

(చేదబావులు)

713

జిల్లాలోని నీటి వనరుల

వివరాలు

పీడబ్ల్యూడీ మోటర్లు

362

చేతిపంపులు

4,132

సింగిల్‌ ఫేజ్‌ మోటర్లు 2,070

గత అనుభవాల దృష్ట్యా..

జిల్లాలో గతేడాది నీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. మిషన్‌ భగీరథ నీటి సరఫరా పూర్తిస్థాయిలో జరగలేదు. మండుటెండల తీవ్రతకు చేదబావులు, బోరుబావుల్లోని నీరు అడుగంటిపోయింది. దీంతో జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లోని అనేక గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. మార్చి వరకు కొంత పరవా లేకున్నా ఏప్రిల్‌, మే లో సమస్య జఠిలమైంది. దీంతో ప్రజలు గుక్కెడు నీటి కోసం నానా అవస్థలు పడ్డారు. ముఖ్యంగా ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలోని కొన్ని గిరిజన గ్రామాలతో పాటు ఏజెన్సీ మండలాల్లోని పలు ఆదివాసీ గూడేలు, తండాల్లో నీటి సమస్య కారణంగా ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఏడాది అలాంటి సమస్య తలెత్తవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముందుగానే నీటి ఎద్దడి ఏర్పడే గ్రామాలను గుర్తించే దిశగా ఆదేశించింది. సకాలంలో వాటిని గుర్తించి సమస్య పరిష్కారానికి ముందస్తు చర్యలు చేపట్టాలని భావిస్తోంది.

నిధులు విడుదలయ్యే అవకాశం

జిల్లాలో స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. మండల స్థాయిలోని నలుగురు అధికారులతో కూడిన బృందం ప్రతీ హ్యాబిటేషన్‌ను సందర్శించి అక్కడి స్థితిగతులను పరిశీలిస్తోంది. భవిష్యత్‌లో నీటి ఎద్దడి తలెత్తకుండా ఏం చేయాలనే దానిపై ప్రత్యేక ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. ఈ నివేదికను కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తాం. ఇందుకు అనుగుణంగా నిధులు విడుదలయ్యే అవకాశముంది. జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి తాగునీటి సమస్య లేదు. అయినప్పటికీ భవిష్యత్‌లో సమస్య తలెత్తితే నియంత్రించేలా ముందస్తుగా దృష్టి సారిస్తున్నాం. – చంద్రమోహన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ

● క్షే త్రస్థాయిలో అధికారుల పరిశీలన● నీటి ఎద్దడి ఉన్న గ1
1/2

● క్షే త్రస్థాయిలో అధికారుల పరిశీలన● నీటి ఎద్దడి ఉన్న గ

● క్షే త్రస్థాయిలో అధికారుల పరిశీలన● నీటి ఎద్దడి ఉన్న గ2
2/2

● క్షే త్రస్థాయిలో అధికారుల పరిశీలన● నీటి ఎద్దడి ఉన్న గ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement