మళ్లీ ‘నామినేటెడ్‌’ గోల! | - | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘నామినేటెడ్‌’ గోల!

Feb 20 2026 6:47 AM | Updated on Feb 20 2026 6:47 AM

మళ్లీ ‘నామినేటెడ్‌’ గోల!

మళ్లీ ‘నామినేటెడ్‌’ గోల!

● తరచూ వాయిదాల పర్వం ● హస్తం నేతల్లో తీవ్ర నైరాశ్యం ● ఇప్పటికే అధిష్టానానికి జాబితా ● ఈసారైనా పదవులు వచ్చేనా?

సాక్షి, ఆదిలాబాద్‌: కాంగ్రెస్‌లో మరోసారి నామినేటె డ్‌ పదవుల భర్తీ అంశం చర్చకు వచ్చింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ఢిల్లీలో హైకమాండ్‌కు దీనిపై సీరియస్‌గా సిఫారసు చేశారని, ఏఐసీసీ ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశముందనే ప్రచారం జరుగుతున్నందున మ రోసారి ఈ చర్చ మొదలైంది. ఉగాదిలోపే పదవులు భర్తీ చేయాలని మీనాక్షి కోరిన నేపథ్యంలో ఆశావహుల్లో మళ్లీ ఆశలు రేకెత్తుతున్నాయి. ప్రతీసారి ఇ లాగే చర్చకు రావడం, మళ్లీ వాయిదా పడడం పరి పాటిగా మారింది. దీంతో ఈసారైనా పదవులు భర్తీ చేస్తారా.. లేదా.. అనే అసహనం పార్టీ నేతలు, కా ర్యకర్తల్లో ఉంది. పార్టీ పదవులూ భర్తీ చేయకపోవడంతో వాటి విషయంలోనూ నిరీక్షణే నెలకొంది.

ప్రాతినిధ్యం లేకే వెనుకబాటు!

జిల్లాలో ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో, ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి. ఆదిలాబాద్‌, బోథ్‌, ఆసిఫాబాద్‌లో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక్క ఖానాపూర్‌లోనే కాంగ్రెస్‌ ఎ మ్మెల్యే ఉన్నారు. సరైన ప్రాతినిధ్యం లేక జిల్లా అనే క అంశాల్లో వెనుకబడిపోతోందన్న ఆవేదన హస్తం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. గ్రంథాలయ చైర్మన్‌ పదవిని మినహాయిస్తే ఇతర నామినేట్‌ పదవుల్లో జిల్లాకు ఇప్పటివరకు అవకాశం దక్కలేదు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. ఇప్పటికై నా నామినేటెడ్‌తోపాటు పార్టీ పోస్టులు భర్తీ చేసి జిల్లాలో కాంగ్రెస్‌ అభివృద్ధికి తోడ్పాటునందించాల న్న అభిప్రాయం హస్తం నేతల్లో వ్యక్తమవుతోంది.

ఇప్పటికే జాబితా అందజేత

నామినేటెడ్‌ పదవులకు సంబంధించి జిల్లా నుంచి పలువురి పేర్లతో డీసీసీ నుంచి టీపీసీసీకి ఇదివరకే జాబితా వెళ్లినట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. రాష్ట్రస్థాయిలో రెండు నామినేటెడ్‌ పదవులు కావాలని, ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇవ్వాలని డీసీసీ కో రుతోంది. ఉట్నూర్‌ ఐటీడీఏకు సంబంధించి ఏటీ డబ్ల్యూఏసీ చైర్మన్‌, ఆదిలాబాద్‌ అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ చైర్మన్‌ పదవులు భర్తీ చేయాల్సిన అవసరముందిది. ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కె ట్‌ కమిటీ చైర్మన్‌ పదవి ఖాళీగా ఉంది. బోథ్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవీ కాలం పూర్తి కావడంతో ప్రస్తుతం ఆ పదవి కూడా భర్తీ చేయాల్సి ఉంది.

పార్టీ పదవుల్లో కూడా..

సర్పంచ్‌ ఎన్నికల కంటే ముందు జిల్లాలో డీసీసీ అధ్యక్షుడిగా నరేశ్‌జాదవ్‌ను పార్టీ నియమించింది. జిల్లా కమిటీలో ఇతర పదవులను భర్తీ చేయలేదు. మండల, పట్టణ కమిటీలు వేయలేదు. వీటికి సంబంధించి సమావేశాలు నిర్వహించి పలువురి పేర్ల ను సేకరించి అధిష్టానానికి పంపించారు. ఇక అప్పు డు, ఇప్పుడు నియామకమంటూ దాటవేస్తూ వస్తున్నారు. ఇలా ఆలస్యమవుతుండటంతో పార్టీ కార్యకర్తల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. ఇకనైనా పదవులు భర్తీ చేయాలని వారు కోరుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌ జాదవ్‌ వీటి విషయంలో చర్చించేందుకు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. శనివా రం నుంచి వికారాబాద్‌లో ఇరు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు పది రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌ జాదవ్‌ అందులో పాల్గొనేందుకు వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement