సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలి
ఆదిలాబాద్: రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలని డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్, డీటీఎ స్వో పార్థసారథి సూచించారు. సీఎం కప్ పోటీలకు క్రీడాకారులు వెళ్తున్న ప్రత్యేక బస్సులను ఆదిలాబాద్ బస్టాండ్‌లో గురువారం జెండా ఊ పి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో అత్యుత్తమంగా రా ణించినవారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. కొందరు హన్మకొండలో నిర్వహించనున్న పోటీలు, మరికొందరు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నిర్వహించను న్న పోటీల్లో పాల్గొంటరని తెలిపారు. క్రీడాకా రులు నైపుణ్యాలు ప్రదర్శించి రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్, స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొమ్ము కృష్ణ, డీఎస్‌ఏ అధికారి సురేశ్ పాల్గొన్నారు.


