జై భవానీ.. జై శివాజీ
ఆదిలాబాద్: జై భవానీ.. జై శివాజీ నినాదాలతో జిల్లా కేంద్రం హోరెత్తింది. జిల్లా కేంద్రంలో మరాఠా తిరడే కునభి సమాజం ఆధ్వర్యంలో శివాజీ జ యంతి సందర్భంగా గురువారం సాయంత్రం శో భాయాత్ర నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శ్రీ రాంలీలా మైదానం నుంచి ప్రధాన కూడళ్ల మీదుగా శోభాయాత్ర ముందుకు సాగింది. భజన సంకీర్తనలు, డీజే గీతాల మధ్య శోభాయమానంగా కొనసాగింది. కాషాయ జెండాలను చేతబట్టి యువత దేశభక్తి నినాదాలతో హోరెత్తించారు. దేశభక్తి పాటలపై ఉత్సాహంగా నృత్యాలు చేశారు. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి స్వామి, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, పలువురు సంఘం నాయకులు తదితరులున్నారు.
జై భవానీ.. జై శివాజీ


