నైతిక విలువలు కలిగి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

నైతిక విలువలు కలిగి ఉండాలి

Feb 20 2026 6:47 AM | Updated on Feb 20 2026 6:47 AM

నైతిక విలువలు కలిగి ఉండాలి

నైతిక విలువలు కలిగి ఉండాలి

బోథ్‌: చదువుతో పాటు నైతిక విలువలు కలిగి ఉంటే సమాజంలో గౌరవం లభిస్తుందని ఆదా యపన్ను శాఖ కమిషనర్‌ ప్రకాశ్‌ రాథోడ్‌ పే ర్కొన్నారు. గురువారం మండలంలోని మర్లపల్లి గ్రామంలోగల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు దిశానిర్దేశం చేసేందుకు ప్రత్యేకంగా ‘ప్రేరణ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రకా శ్‌ రాథోడ్‌తోపాటు ప్రముఖ వైద్యుడు రంజిత్‌ హాజరై వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. పేదరికం చదువుకు అడ్డంకి కా దని, పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను అధి రోహించవచ్చని పేర్కొన్నారు. సమయపాలన పాటిస్తూ, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహిస్తూ లక్ష్యం వైపు సాగాలని సూచించారు. ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement