బల్దియా ఎన్నికల ప్రత్యేక విభాగం ఏర్పాటు
కై లాస్‌నగర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఎన్ని కల ప్రత్యేక విభాగాన్నిఏర్పాటు చేశారు. కార్యాలయ మేనేజర్, రెవెన్యూ అధికారితో పాటు ప లువురు ఉద్యోగులను నియమించారు. ఎన్నిక ల నిర్వహణకు అవసరమైన కసరత్తు ఈ విభా గం నుంచే చేపట్టనున్నారు. అయితే ఓటర్ల ము సాయిదా జాబితాలో దొర్లిన తప్పులపై ప్రజల నుంచి అభ్యంతరాలు అందుతున్నాయి. తొలి రోజు కేవలం ఐదు రాగా, శనివారం ఏకంగా 55 రావడం జాబితాలో దొర్లిన పొరపాట్లకు అద్దం పడుతుంది. ఇతర వార్డుల్లో చేర్చిన త మను తిరిగి తమ వార్డుల్లో కొనసాగించాలని కోరుతూ విజ్ఞప్తులు అందజేస్తున్నారు. మున్సి పల్ సిబ్బంది వారికి అందిన అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జాబితాను సవరించే ప్రక్రియ చేపడుతున్నారు. కమిషనర్ సీవీ ఎన్. రాజు ఈప్రక్రియను శనివారం పరిశీలించారు. జాబితాలో పొరపాట్లకు తావివ్వకుండా ఓటర్లంతా ఒకే వార్డులో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పారదర్శకమైన ఓటరు జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు.


