విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ సంఘ భవనంలో అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లా కేంద్రానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు వచ్చి హామీలు ఇవ్వడమే తప్పా సమస్యలు పరిష్కరించడం లేదని తెలిపారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల, బీఎస్సీ నర్సింగ్ కళాశాలలకు భూమిని గుర్తించినప్పటికీ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉందన్నారు. ఇంద్రవెల్లిలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చినా సర్వే చేపట్టడం లేదన్నారు. కార్యక్రమంలో ఆయా విద్యార్థి సంఘాల నాయకులు సచిన్, కిరణ్, శివ, గణేష్, అర్ఫాత్, శ్రీనివాస్, ప్రశాంత్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


