జూనియర్ మిస్ ఇంటెలిజెంట్‌గా ఇతీక్ష
ఆదిలాబాద్: జిల్లా కేంద్రానికి చెందిన కొంకటి ఇతీక్ష జూనియర్ మిస్ ఇంటెలిజెంట్ టైటిల్ గెలుచుకుంది. ఈనెల 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో నిర్వహించిన లిటిల్ మిస్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా ఫ్యాషన్ షో ఆడిషన్స్‌లో తనదైన ప్రతిభతో మెప్పించి విజేతగా నిలిచింది. జడ్జిగా వ్యవహరించిన అఖండ సినిమా ఫేం నితిన్ మెహతా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి టైటిల్ కై వసం చేసుకున్నట్లు తల్లిదండ్రులు సృజన, శ్రావణ్ కుమార్ తెలిపారు. విజేతగా నిలిచిన చిన్నారికి ప్రముఖ సినీ నటుడు కౌశల్ టైటిల్ బహూకరించారు.


