‘ఇళ్ల నిర్మాణం అడ్డుకుంటే ఎన్నికలు బహిష్కరిస్తాం’ | - | Sakshi
Sakshi News home page

‘ఇళ్ల నిర్మాణం అడ్డుకుంటే ఎన్నికలు బహిష్కరిస్తాం’

Dec 25 2025 8:08 AM | Updated on Dec 25 2025 8:08 AM

‘ఇళ్ల నిర్మాణం అడ్డుకుంటే ఎన్నికలు బహిష్కరిస్తాం’

‘ఇళ్ల నిర్మాణం అడ్డుకుంటే ఎన్నికలు బహిష్కరిస్తాం’

ఉట్నూర్‌రూరల్‌: ఉమ్మడి జిల్లాలోని కొలాం గిరిజ నుల ఇళ్ల నిర్మాణాలను అడ్డుకుంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు బహిష్కరిస్తామని కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సోనేరావు హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని ఐటీడీ ఏ కార్యాలయానికి వచ్చి పీవో లేకపోవడంతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సోనేరావు మాట్లాడు తూ.. ప్రధానమంత్రి జన్‌మన్‌, ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణాలను కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ పేరుతో అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని తెలిపారు. గతంలోనూ ఐటీడీఏ ఎదుట మహాధర్నా నిర్వహించగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌, ఐటీడీఏ పీవో ఇళ్ల నిర్మాణా లకు అడ్డంకులు లేకుండా ప్రభుత్వాలకు నివేదికలు పంపిస్తామని హామీ ఇచ్చినప్పటికీ గిరిజన ప్రాంతా ల్లో మంజూరైన ఇళ్లు నిర్మించకుండా అటవీశాఖ అ డ్డుకుంటోందని చెప్పారు. కేంద్రం ప్రభుత్వంలోని తొమ్మిది శాఖలకు నిధులు మంజూరు చేస్తుండగా పీవీటీజీల అభివృద్ధి, సంక్షేమం ప్రశ్నార్థకంగా మా రిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని, లేని పక్షంలో ఈ నెల 29న మరోసారి ఐటీడీఏ ఎదుట ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బహిష్కరణకు కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. ధర్నాకు అధికసంఖ్యలో కొలాం గిరి జనులు హాజ రుకావాలని కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రా మాల పటేళ్లు టేకం లక్ష్మణ్‌, భీమ్రావు, ముకుందరా వు, టేకం చిన్ను, కొడప మారుతి, టేకం ఆనంద్‌రా వు, ఆత్రం మారు, మాణిక్‌రావు, సోనీరావు, ఆత్రం తుకారాం, సోనేరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement