ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్‌టౌన్: ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన 17 మంది తమ సమస్యలపై ఎస్పీకి అర్జీలు అందజేశారు. వాటిని స్వీకరించిన అనంతరం సంబంధిత పోలీసు అధికారులకు ఆయన ఫోన్ ద్వారా సూచనలు జారీ చేశారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది వామన్ తదితరులు పాల్గొన్నారు.


