ఎవరు గెలిచినా మనోళ్లే!
బహిరంగ మద్దతుకు ముఖ్యనేతల వెనుకంజ
గెలిచి రావాలని అభ్యర్థులకు సూచన
విజయం సాధించిన వారికి కండువా కప్పాలని నిర్ణయం
కై లాస్‌నగర్: జిల్లాలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీల మద్దతు ఆశిస్తూ ఒక్కో పార్టీలో ఇద్దరు, ముగ్గురేసి అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరంతా ఏళ్లుగా ఆయా పార్టీ జెండాలను మోసిన వారే కావడం గమనార్హం. అలాంటి వారికి రిజర్వేషన్ కలిసి రావడంతో సర్పంచ్‌గా ఎన్నికవ్వాలని భావిస్తున్నారు. పార్టీల మద్దతును ఆశిస్తున్నారు. మొదటి, రెండో విడత ఎన్నికలకు సంబంధించిన గుర్తులు కూడా ఖరారు కావడంతో ఇంటింటి ప్రచారం ముమ్మురం చేశారు. ఓటర్ల వద్దకు వెళ్లి ఆశీర్వదిస్తే ముఖ్యనేతల అండతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. గెలిపించాలని వేడుకుంటున్నారు.


