జీపీవోల నూతన కార్యవర్గం
కైలాస్‌నగర్: గ్రామ పరిపాలన అధికారుల (జీ పీవో) సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా ఇందూర్ గంగన్న, ప్రధాన కార్యదర్శిగా అయ్యూబ్, ఉపాధ్యక్షులుగా సాయి, సలీం, అ సోసియేట్ అధ్యక్షుడిగా శ్రీధర్, కోశాధికారిగా వామన్, మహిళా అధ్యక్షురాలిగా అనసూయ, ఉపాధ్యక్షురాలిగా సువర్ణ, ప్రధాన కార్యదర్శిగా అహల్య, సహాయకార్యదర్శులుగా నరేశ్‌కుమార్, పులి స్వామి, కార్యవర్గ సభ్యులుగా పురుషో త్తం, శంకర్, అరుణ్, వినోద్, అక్షయ్, రమేశ్, అరవింద్, జ్యోతి ఎన్నికయ్యారు.


