● 8 డిగ్రీలకు చేరువైన కనిష్ట ఉష్ణోగ్రత ● వణికిస్తున్న శ
కై లాస్‌నగర్: జిల్లాపై చలిపంజా విసురుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. రెండు రోజులుగా 7 నుంచి 8 డిగ్రీల సెల్సియస్‌గా న మోదవుతున్నాయి. చలి తీవ్రత పెరగడంతో జనం గజగజ వణికిపోతున్నారు. శీతలగాలులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏజెన్సీ, అటవీప్రాంతాల్లోని పల్లెలు, పంట పొలాలపై మంచు దుప్పటి కప్పేస్తోంది. ఉదయం 10 దాటినా సూర్యుడు బయటకు రాని పరిస్థితి. పొగమంచు రహదారులను కమ్మేస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళలో సైతం లైట్లు వేసుకుని ప్ర యాణంచాల్సి వస్తోంది. వేకువజామున పనులకు వెళ్లే కూరగాయాలు, పాల విక్రేతలు, పేపర్‌బా య్స్, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఆర్టీసీ కా ర్మికులు చలితీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. శీతల గాలుల ప్రభావంతో చిన్నారులు, వృద్ధులు, అస్తమా రోగులకు అవస్థలు తప్పని పరిస్థితి. సా యంత్రం ఆరు దాటిందంటే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర సమయంలో బయట కు వెళ్లే వారు స్వెట్టర్లు, ఇతర రక్షణ కవచాలు ధ రిస్తున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో గ్రామాల్లో జ నం చలి మంటలు కాగుతూ రక్షణ పొందుతున్నా రు. రాబోయే రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తగు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
చలిమంట కాగుతున్న యువకులు
జిల్లాలో భీంపూర్ మండలంలోని అర్లి(టి)లో 8డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే బజార్‌హత్నూర్‌లో 8.5, బోథ్ మండలం పొచ్చెరలో 8.7, సాత్నాలలో 8.8, తాంసి, ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్‌దరి, బేల, చెప్రాలలో 9.1, సొనాలలో 9.3, గాదిగూడ మండలం లోకారి, తలమడుగులో 9.4, ఆదిలాబాద్ అర్బన్‌లో 9.5, తలమడుగు మండలం భరంపూర్‌లో 9.7 మావలలో 9.8, నేరడిగొండలో 9.9, ఇచ్చోడలో 10 డిగ్రీలుగా నమోదైంది.


