ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
ఆదిలాబాద్‌రూరల్: ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని చాందా(టి), జందాపూర్ సమస్యాత్మక గ్రామాలను ఆదివారం ఆయన సందర్శించారు. పోలింగ్ కేంద్రాలను పరిశీ లించారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవిని వేలం ద్వారా నిర్ణయించడం చట్టరీత్యా నేరమని అ న్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని సూ చించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించా రు. ఆయన వెంట డీఎస్పీ ఎల్ జీవన్‌రెడ్డి, రూరల్ సీఐ ఫణిదర్, ఎస్సై విష్ణువర్ధన్, సిబ్బంది ఉన్నారు.
తాంసి: పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలో ని కప్పర్ల గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రా మస్తులకు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు. ఆయన వెంట తాంసి, తలమడుగు, రూరల్ ఎస్సైలు జీవన్‌రెడ్డి, రాధిక, విష్ణు ఉన్నారు.
జైనథ్: ఎన్నికల నేపథ్యంలో స్థానిక లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఎస్పీ ఓటర్లతో మా ట్లాడారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి పా టించాలన్నారు. వారి వెంట డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐ శ్రవణ్‌కుమార్, ఎస్సై గౌతమ్, తదితరులున్నారు.


