మండలానికో బెస్ట్ స్కూల్
పైలెట్ ప్రాజెక్ట్‌గా జిల్లా ఎంపిక మూడు యూపీఎస్, 19 ఉన్నత పాఠశాలలు ఇంటర్ వరకు విద్యాబోధన చేసేలా చర్యలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విద్యాశాఖ
ఆదిలాబాద్‌టౌన్: సర్కారు బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేద విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించేందుకు ముందుకు సాగుతోంది. మండలానికి ఒక బెస్ట్ స్కూల్‌ను ఏర్పాటు చేసి మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించాలని భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు జిల్లాలు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక కాగా, అందులో జిల్లా ఉన్నట్లు విద్యా శాఖాధికారులు చెబుతున్నారు. ప్రాథమికస్థాయి నుంచి ఇంటర్ వరకు ఇందులో విద్యాబోధన అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఒకే ఆవరణలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు కొనసాగుతున్న వాటిని ఎంపిక చేశారు. జాతీయ విద్యావిధానంలో భాగంగా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలుస్తోంది.
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా..
మండలానికి ఒకటి చొప్పున విద్యార్థుల సంఖ్య ఎ క్కువగా ఉన్న పాఠశాలలు, అన్ని సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలు, పక్కా భవ నం, క్రీడా మైదానం ఉన్నవాటిని ఈ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. కలెక్టర్ రాజర్షిషా ఆదేశాల మేరకు విద్యా శాఖాధికారులు జిల్లాలోని 19 ఉన్నత, మూడు ప్రాథమికోన్నత పాఠశాలలను ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఉత్తర్వులు అందగానే అందులో అన్ని వసతులు కల్పించేలా చర్యలు చేపట్టనున్నారు. అయితే పదో తరగతి పూర్తయిన తర్వాత గ్రామాల్లో బాలికలు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. కొన్నిచోట్ల డ్రాపౌట్‌గా మిగులుతున్నారు. దీన్ని తగ్గించేలా యంత్రాంగం దృష్టి సారిస్తోంది.
ఎంపికై న పాఠశాలలు ఇవే..
భీంపూర్ మండలంలోని యూపీఎస్ భీంపూర్, జైన థ్ మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ కూర, బేల మండలంలోని యూపీఎస్ ఉర్దూ మీడియం, గాదిగూడలోని యూపీఎస్ లోకారి(బి), నార్నూర్‌లోని జెడ్పీహెచ్‌ఎస్ భీంపూర్, ఇంద్రవెల్లిలోని ధనోర(బి), గుడిహత్నూర్‌లోని గుడిహత్నూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని భీంసరి, ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, మావలలోని జెడ్పీఎస్‌ఎస్ మావ ల, తాంసి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశా ల, తలమడుగులోని సుంకిడి, బజార్‌హత్నూర్‌లోని జెడ్పీఎస్‌ఎస్, బోథ్‌లోని ధనో ర(బి), నేరడిగొండ మండల కేంద్రంలోని జెడ్పీఎస్‌ఎస్, ఇచ్చోడలోని జెడ్పీఎస్‌ఎస్ ఉర్దూ మీడి యం, సిరికొండ మండల కేంద్రంలోని జెడ్పీఎస్‌ఎస్, ఉట్నూర్‌లోని శ్యాంపూర్, భోరజ్‌లోని గిమ్మ(కె), సాత్నాలలోని అడ, సొనాలలోని జెడ్పీఎస్‌ఎస్‌లు ఎంపికయ్యాయి.


