బహుముఖ పోటీ
సాక్షి,ఆదిలాబాద్: ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ.. ఇక్కడ సర్పంచ్ పదవి కోసం ఏకంగా 15 మంది బరిలో ఉన్నారు.. 12,622 మంది ఓటర్లు ఉండగా, అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఓట్ల చీలికపై పోటీదారుల్లో బెంగ కనిపిస్తుంది. ఓటర్ నాడీ పట్టలేక సతమతం అవుతున్నారు. ప్రచారాన్నే నమ్ముకొని ముందుకు కదులుతున్నారు. మరోవైపు నార్నూర్ మండలం నాగల్‌కొండలో 1,419 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇలా మొదటి విడత ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో పలుచోట్ల బహుముఖ పోటీ కనిపిస్తుంది.
మొదటి విడత ఎన్నికలు ఈనెల 11న ఎస్టీ రిజర్వుడ్ అయిన నార్నూర్, గాదిగూడ, ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ, ఇచ్చోడ మండలాల్లో జరగనున్నాయి. మొత్తం 166 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, 33 చోట్ల సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. మిగతా 133 చోట్ల ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 525 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఇద్దరే అభ్యర్థులు..
మొదటి విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లో పదుల సంఖ్యల గ్రామాల్లో ఇద్దరే అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ పరిణామం అధికార కాంగ్రెస్‌కా.. లేనిపక్షంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు లాభిస్తోందా అనేది వేచిచూడాల్సిందే. కాగా, కొన్నిచోట్ల అనధికారిక పొత్తులే ఇలాంటి పరిస్థితికి కారణంగా తెలుస్తోంది.
త్రిముఖం.. చతుర్ముఖం
పలుచోట్ల త్రిముఖం, చతుర్ముఖ పోటీ కనిపిస్తుంది. అలాంటి చోట్ల ప్రధాన పార్టీలు బలపర్చిన అభ్యర్థు లే బరిలో ఉన్నారు. ఆయా చోట్ల అభ్యర్థులు తమ ను ఏ పార్టీ బలపర్చిందో స్పష్టంగా చెబుతూ బ రి లోకి దిగుతున్నారు. దీంతో ఫలితాలు ఎలా ఉంటా యనేది ఆసక్తికరంగా మారింది. నేరుగా పార్టీ కండువా వేసుకొని ప్రచారంలో కదులుతున్నారు. అ యితే ఓటర్లు ఎవరి వైపు నిలుస్తారో చూడాల్సిందే.
తొలివిడత ఎన్నికలు జరిగే మండలాల్లో పరిస్థితి ఇలా..
మండలం మొత్తం పోటీ నెలకొన్న ఇద్దరు ముగ్గురు నలుగురు అంతకంటే జీపీలు జీపీలు అభ్యర్థులు అభ్యర్థులు అభ్యర్థులు ఎక్కువ అభ్యర్థులు
ఇచ్చోడ 33 28 05 10 07 06
సిరికొండ 18 11 03 03 03 02
ఇంద్రవెల్లి 29 25 06 06 02 11
ఉట్నూర్ 38 31 07 06 06 12
నార్నూర్ 23 17 05 00 07 05
గాదిగూడ 25 21 05 00 10 06
మొత్తం 165 133 31 25 35 42
బహుముఖ పోటీ


