ఎన్నికల నిర్వహణలో ఆర్‌వోల పాత్ర కీలకం
కై లాస్‌నగర్: ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో రెండు, మూడోవిడత ఎన్నికల స్టే జ్–2 రిటర్నింగ్ అధికారులకు సోమవారం శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, మో డల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఓటుహక్కు వినియో గం కోసం 18 రకాల గుర్తింపు పత్రాలు ఉన్నాయని, వాటిలో ఏదైనా ఒకదాన్ని తప్పనిసరిగా తీసుకువచ్చేలా ఓటర్లకు అవగాహన కల్పించా లన్నారు. ఇందులో స్థానికసంస్థల అదనపు కలె క్టర్ రాజేశ్వర్, జిల్లా శిక్షణ నోడల్ అధికారి మ నోహర్, డీపీవో రమేశ్, డిఎల్పీవో ఫణిందర్, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.
పోస్టల్ బ్యాలెట్ విధానం పరిశీలన..
ఇంద్రవెల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అ న్నారు.మండలకేంద్రంలోని ఎంపీడీవో కా ర్యా లయాన్ని సోమవారం సందర్శించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విధానం పరిశీలించారు. అ నంతరం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేయనున్న ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. అధికా రులకు పలు సూచనలు చేశారు. ఇందులో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో జీవన్‌రెడ్డి, ఆర్‌వోలు,పోలింగ్ సిబ్బంది ఉన్నారు.
ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలి
ఉట్నూర్‌రూరల్: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పీవో యువరాజ్ మర్మాట్‌తో కలసి కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఎంపీడీవో రాంప్రసాద్, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, సిబ్బంది తదితరులు ఉన్నారు.


