
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
నార్నూర్: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్ రాజ ర్షిషా అన్నారు. మండలంలోని అంబేద్కర్ భ వన్‌లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన వెదురుబొంగుల కటింగ్ యంత్రాల ను శుక్రవారం ఆయన పరిశీలించారు. వెదురు వస్తువులను మార్కెటింగ్ చేసే విధానం అడిగి తెలుసుకున్నారు. మహిళలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. అనంతరం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. తాగునీటి పైపులైన్ పగిలిపోయి ఉండడంపై హెచ్‌ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారికి పలు అంశాలను బోధించారు. అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. టెలీమెడిసన్ కేంద్రాన్ని పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఇంగ్లీష్ ఫౌండేషన్ లర్నింగ్ ప్రోగ్రాంపై సమీక్ష నిర్వహించారు. ఇందులో డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్, జెడ్పీ సీఈవోరాథోడ్ రవీందర్, ఏంఈవో పవార్ అనిత, ఎంపీడీవో గంగాసింగ్, తహసీల్దార్ రాజలింగు, ఎంపీవో సాయిప్రసాద్, పీఆర్ డీఈ లింగన్న, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ శ్రీనివాస్ తదితరులున్నారు.
నార్నూర్ పంచాయతీని దత్తత తీసుకోవాలని వినతి
నార్నూర్ గ్రామ పంచాయతీని దత్తత తీసుకు ని అభివృద్ధి చేయాలని మండల పర్యటనకు వ చ్చిన కలెక్టర్‌కు గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు. ఇందులో మాజీ సర్పంచ్ గజానంద్‌నాయక్, పీఏసీఎస్ చైర్మన్ సురేశ్, మహేందర్, బీజేపీ, కాంగ్రెస్ మండలాధ్యక్షులు భిక్షపతి, దేవురావు, తదితరులున్నారు.