
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి సారించాల ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి ఎస్.రాజేశ్వర్ ఆదేశించారు. ము న్సిపల్ కార్యాలయంలోని తన చాంబర్‌లో మున్సి పల్ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించా రు. పట్టణంలోని కేఆర్‌కే కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీపై ఆరా తీశారు. లబ్ధి దారులను ఎంపిక చేసి జాబితాను రెవెన్యూ శాఖకు అందజేశామని కమిషనర్ తెలిపారు. అయితే మౌలిక సౌకర్యాలు లేనందున వాటి పంపిణీ నిలిచిపోయిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల కోసం అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలన్నారు. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నా రు. ఆక్రమణలపై వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సీవీ ఎన్. రాజు, మున్సిపల్ ఇంజినీర్ పేరిరాజు, డీఈ ఎం.కార్తీక్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ బైరి శంకర్, టీపీవో సుమలత , పర్యావరణ ఇంజినీర్ చౌహాన్ అవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.