
అసెంబ్లీలో నాలుగుసార్లు ప్రస్తావించా..
కొరటా–చనాఖ బ్యారే జీ అంశాన్ని గతంలో నాలుగు సార్లు అసెంబ్లీలో ప్రస్తావించాను. స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి నిధులు కేటాయించాలని కోరాను. ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసినా కలెక్టర్ ఖాతాలో నుంచి ల్యాప్స్ అవుతున్నా యి. రైతులకు త్వరితగతిన సాగునీరు అందేలా తగు చర్యలు చేపట్టాలి.
– పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే
ఏళ్లు గడుస్తున్నాయి..
బ్యారేజ్ పనులు ప్రా రంభించి ఏళ్లు గడుస్తు న్నా పనులు మాత్రం ఇంకా పూర్తి కావడం లేదు. ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఇ ప్పటికై నా ప్రభుత్వం వెంటనే స్పందించి బ్యా రేజ్ నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించాలి.
– గంధం సురేశ్, రైతు, మాండగడ
నిధులు కేటాయించాలి..
బ్యారేజ్ నిర్మాణం పూ ర్తయ్యేలా నిధులు కేటా యించాలి. పెన్‌గంగ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా మా పంటలు ముంపునకు గురవుతున్నాయి. పనులు పూర్తయితే ముంపు ప్రభావం తగ్గుతుంది. అలాగే యా సంగికి సాగునీరు అంది మేలు జరుగుతుంది.
– సంతోష్, రైతు, డొలార
ఇటీవల రూ.40 కోట్లు విడుదల
బ్యారేజీ కెనాల్, డిస్ట్రిబ్యూటరీ పనులు నిధుల లేమి కారణంగా ప్రస్తుతం నిలిచిపోయాయి. ఇటీవల ప్రభుత్వం రూ.40 కోట్ల నిధులను విడుదల చేసింది. వీటితో త్వరలోనే పనులు ప్రారంభిస్తాం.
– ప్రభు,ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్

అసెంబ్లీలో నాలుగుసార్లు ప్రస్తావించా..

అసెంబ్లీలో నాలుగుసార్లు ప్రస్తావించా..