
వివాహిత ఆత్మహత్య
బాసర: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. సీఐ సాయికుమార్ తెలిపిన వివరాల మేరకు మహారాష్ట్రలోని హజిని గ్రామానికి చెందిన మాధవి (23)కి బాసర మండలంలోని దౌడాపూర్ గ్రామానికి చెందిన కర్మానే మనోజ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వారికి ఇద్దరు పిల్లలు సంతానం. కొంతకాలంగా మనోజ్ మద్యం సేవించి ఇంటికి వచ్చి అదనపు కట్నం తేవాలని మా ధవిని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేసేవా డు. దీంతో మనస్తాపానికి గు రైన మహిళ బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులతో నే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురా లి తండ్రి రాంచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.