
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
లక్ష్మణచాంద: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఒడ్డెపెల్లి గ్రామానికి చెందిన పల్లపు బుచ్చన్న (52) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురై ఈ నెల 13న గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.