
ఉద్యోగ వేట ఇక సులభతరం
బోథ్: డిజిటల్ యుగంలో నిరుద్యోగులకు ఉ ద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతికతతో కూడిన ‘డీట్’ (డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎకేస్ఛ్‌ంజ్ ఆఫ్ తెలంగాణ) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. నిరుద్యోగులు, ప్రైవేటు రంగ సంస్థల మధ్య ప్రత్యక్ష వారధిగా ఈ యాప్ పనిచేయనుంది.
పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పర్యవేక్షణ
పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు. విద్యా సంస్థలు, ప్ర భుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థల సమన్వయంతో ఇది పర్యవేక్షించబడుతుంది. తద్వారా, అ భ్యర్థులు తమ అర్హతలకు తగిన ప్రైవేటు రంగ ఉద్యోగ అవకాశాలను సులభంగా పొందేందు కు మార్గం సుగమం అవుతుంది. పరిశ్రమలు, నిరుద్యోగులు ఈ యాప్‌లో నమోదు చేసుకుంటే కంపెనీలు తమకు అవసరమైన, స్కిల్ ఉన్న వారికి సందేశాన్ని పంపిస్తారు. వందల కంపె నీలన్నీ ఒకే చోట ఉండటంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉటుంది.
అర్హతలు, నైపుణ్యాల ఆధారంగా
ఉద్యోగాలు
డీట్ యాప్ ద్వారా పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, ఆపై చదివిన అభ్యర్థులు ప్రయోజనం పొందవచ్చు. వారి విద్యార్హత, నైపుణ్యాలు, అనుభవం ఆధారంగా కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. డిగ్రీ చదువుతున్న అభ్యర్థులకు కూడా నమోదు చేసుకునే అవకాశం కల్పించడం అదనపు విశేషం. ఫార్మా, ఇండస్ట్రియల్, బీపీవో, కస్టమర్ ఎగ్జిక్యూటివ్ సపోర్ట్, బిజినెస్ డెవలప్‌మెంట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌తో పాటు అనేక ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.
● నిరుద్యోగులు, ఉద్యోగాలు కల్పించే ఔత్సాహిక కంపెనీలు ఈ యాప్‌లో నమోదు చేసుకోవచ్చు.
● కంపెనీ నిర్వాహకులు, యాప్‌లో నమోదైన అభ్యర్థుల విద్య, నైపుణ్య వివరాలను పరిశీలించి, నేరుగా వారిని సంప్రదిస్తారు.
● కంపెనీల నియమావళిని బట్టి రాత లేదా మౌఖిక పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయానికి ఇందులో అవకాశం ఉండదు.
నమోదు విధానం
● నిరుద్యోగులు తమ పూర్తి వివరాలను డీట్ యాప్‌లో లేదా అధికారిక వెబ్‌సైట్ www. deet.telangana.gov.in లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
● ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా యాప్‌ను తెరవాలి.
● విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యాలు, అనుభవం, ఇంటర్న్‌షిప్‌ల వివరాలు నమోదు చేయాలి.
● పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్, అప్రెంటిస్‌షిప్‌లలో దేని కోసం అన్వేషిస్తున్నారో, ఏ రంగంలో ఉద్యోగం కావాలో స్పష్టం చేయాలి.
● విద్యార్హత పత్రాలను యాప్‌లో అప్‌లోడ్ చేయడంతో నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.