
హోరాహోరీగా బ్మాడ్మింటన్ పోటీలు
మంచిర్యాలఅర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల క్లబ్‌లో గురువారం నిర్వహించిన అండర్–14, 17, 19 బాలబాలికల జోనల్‌స్థాయి ఎంపిక పోటీలు హోరాహోరీగా సాగాయి. బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముఖేష్‌గౌడ్ పోటీలను ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 120 మంది క్రీడాకారులు పాల్గొనగా ఒక్కో గ్రూపు నుంచి ఐదుగురు చొప్పున 30 మంది ఎంపికయ్యారు. అండర్–14 హైదరాబాద్, అండర్–17 మేడ్చల్, అండర్–19 మహబూబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి యాకూబ్ తెలిపారు. కార్యక్రమంలో అండర్–19 ఎస్‌జీఎఫ్ కార్యదర్శి బాబురావు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పులూరి సుధాకర్, జెడ్పీబాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండి రమేశ్, ఫిజికల్ డైరెక్టర్ రేణి రాజయ్య, కుమురంభీం జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.