
సర్వం సిద్ధం
ఆదిలాబాద్: దసరా మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. విజయదశమి వేడుకలను గురువారం వై భవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని దసరా మైదానంలో హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణ దహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇది దశాబ్దాలుగా ఆనవాయితీగా కొనసాగుతోంది. ముందుగా పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వ రి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం శోభా యాత్రగా సాగి దసరా మైదానంలో జమ్మి పూజ నిర్వహిస్తారు. ధ్వజారోహణం చేపట్టి అతిథులు రావణ దహన కార్యక్రమంలో పాల్గొంటారు. ప్ర జలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ సమితి అధ్యక్షుడు బొంపె ల్లి హనుమాండ్లు వెల్లడించారు. మరోవైపు సనా తన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న వేడుకలకు సంబంధించి సైతం ఏర్పాట్లు పూర్తయినట్లు సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమా ర్ ఖత్రి తెలిపారు.
పండుగకు సొంతూరుకే..
తాంసి: మా సొంతూరు తాంసి. ఉద్యోగరీత్యా కుటుంబంతో సహా కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాం. రాష్ట్ర సచివాలయంలో రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నా. ఎన్ని పనులున్నా పండుగలకు మాత్రం అందరం కలిసి ఇక్కడికే వస్తుంటాం. పుట్టి పెరిగిన గ్రామంలో పండుగలు జరుపుకోవడం ఆనందంగా ఉంటుంది. అలాగే అందరిని కలుసుకునే అవకాశం ఉంటుంది. –రామగిరి స్వామి

సర్వం సిద్ధం

సర్వం సిద్ధం