
మహారాష్ట్ర రైతులకు అవకాశం కల్పించాలి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ మార్కెట్‌లో మహారాష్ట్ర రైతులకు పత్తి అమ్ముకునే అవకాశం కల్పించాలని బీజేపీ కిసాన్‌మోర్చా కిన్వట్ అధ్యక్షుడు బజరంగ్‌రెడ్డి, ఆదిలా బాద్ ఏఎంసీ మాజీ డైరెక్టర్ ఎల్టీ శేఖర్‌రెడ్డి కోరారు. ఈమేరకు జిల్లా కేంద్రంలో ఎంపీ నగేశ్‌ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. మహారాష్ట్రలోని కిన్వట్, మాహోర్ తాలుకాలో పత్తి ప్రాసెసింగ్ పరిశ్రమలు లేకపోవడంతో రైతులు సుదూర ప్రాంతాలకు వెళ్లి పత్తిని విక్రయించాల్సి వస్తుందని తెలిపారు. దీంతో రవాణా ఖర్చులు ఎక్కువై రైతులపై ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మహారాష్ట్ర రైతులు సైతం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి అమ్ముకునే అవకాశం కల్పించాలని కోరారు. ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.
దుర్గామాతను దర్శించుకున్న ఎంపీ
ఇచ్చోడ: మండల కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో దుర్గామాతను ఎంపీ నగేశ్ బుధవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట స్థానిక నాయకులు కృష్ణకుమార్, శ్రీనివాస్ తదితరులున్నారు.

మహారాష్ట్ర రైతులకు అవకాశం కల్పించాలి