ఎన్నికల విధుల్లో మినహాయింపు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధుల్లో మినహాయింపు ఇవ్వాలి

Oct 2 2025 8:16 AM | Updated on Oct 2 2025 8:16 AM

ఎన్నికల విధుల్లో మినహాయింపు ఇవ్వాలి

ఎన్నికల విధుల్లో మినహాయింపు ఇవ్వాలి

ఆదిలాబాద్‌టౌన్‌: స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో దివ్యాంగులు, గర్భిణులు, ఫీడింగ్‌ ఉపాధ్యాయులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మినహాయింపు ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణకుమార్‌ అన్నారు. ఈమేరకు కలెక్టర్‌ రాజర్షిషాను బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల రోజు వివాహ శుభకార్యాలు ఉన్నటువంటి, ఉద్యోగ విరమణ దగ్గర ఉన్న ఉపాధ్యాయులకు విధులు కేటాయించవద్దని కోరారు. 2024లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే రెమ్యూనరేషన్‌ ఇవ్వలేదని, ఆ డబ్బులను ఇప్పించాలని విన్నవించారు. ఇందులో యూనియన్‌ నాయకులు రవీందర్‌రెడ్డి, దేవ్‌రావు, నతీన్‌ కుమార్‌, ప్రభాకర్‌, శ్రీనివాస్‌, నాందేవ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement