
ఎట్టకేలకు ఉట్నూర్ పంచాయతీకి ఎన్నికలు
ఉట్నూర్‌రూరల్: ఆరేళ్లుగా ఉట్నూర్ గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరగలేదు. ఈ సారి మాత్రం నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. గత ప్రభుత్వం ఈ మేజర్ పంచాయతీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసేందుకు సన్నద్ధం కాగా.. గిరిజన చట్టాలను ప్రస్తావిస్తూ ఆదివాసీ, గిరిజనులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు అప్పటి ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ఈ క్రమలోనే 2019లో ఉట్నూర్ పంచాయతీకి సర్పంచ్ ఎన్నికలు నిలిచిపోయాయి. అప్పటి నుంచి మేజర్ గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి పాలనలో సాగింది. తాజాగా ఈ సారి నోటిఫికేషన్‌లో ఉట్నూర్‌కు సైతం ఎన్నిక ఉంటుందని ప్రభుత్వం వెల్లడించడంతో ఆశావహుల్లో జోష్ పెరిగింది. ఆయా పార్టీల నాయకులు ఇప్పటికే తమ ప్రయత్నాలు ముమ్మరం చేవారు. అయితే సర్పంచ్ స్థానానికి ఎస్టీ మహిళా రిజర్వేషన్ ఖరారు కావడంతో పలువురు నాయకులు తమ సతులను బరిలోకి దించేందుకు సిద్ధం చేస్తున్నారు.