ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తొడసం కైలాశ్ రామాయణాన్ని గోండి భాషలోకి అనువదించారు. సుందరకాండ 5వ భాగాన్ని ఆయన పుస్తక రూపంలో పొందుపర్చారు. దీనిని ఈనెల 26న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. తొడసం కైలాశ్ స్వగ్రామం మావల మండలం వాగాపూర్.
గతంలో ఆయన మహాభారతాన్ని గోండి భాషలోకి అనువదించారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గోండి భాషలో వార్తలు చదవడం, కథలు చెప్పడం, పాటలు పాడించడం చేశారు. దీంతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మన్‌కీ బాత్ ప్రసారంలో కైలాశ్‌ను అభినందించారు. గిరిజనులకు రామాయణం, మహాభారతం గురించి తెలియాలనే ఉద్దేశంతో వాటిని గోండి భాషలోకి అనువదించినట్లు కైలాశ్ తెలిపారు.


