మహనీయుడు బిర్సాముండా
ఆదిలాబాద్‌రూరల్: ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమించిన మహనీయుడు బిర్సాముండా అని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. బిర్సాముండా జయంతి పురస్కరించుకుని రైల్వేస్టేషన్ ఎదుట గల ముండా విగ్రహానికి ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకు ముందు కలెక్టర్ రాజర్షి షా సైతం అధికారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులతో కలిసి ముండా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు భీంసేన్‌రెడ్డి, ఆదినాథ్, రాజేశ్, ఆదివాసీ సంఘాల నాయకులు రాంకిషన్, తానాజీ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.


