ఇద్దరు పిల్లలున్న మధ్య తరగతి కుటుంబం
నెలవారీ ఖర్చుల వివరాలు (సరాసరి)
ఇంటి అద్దె రూ.4,000 రేషన్ సరుకులు రూ.4,000
పాలు రూ.1,000
కేబుల్ రూ.400
మినరల్ వాటర్ రూ.400
కూరగాయలు రూ.3,000
స్కూల్ ఫీజు(ఇద్దరికి) రూ.5,000
బైక్ పెట్రోల్ రూ.1500
వైద్యం, ఇతర ఖర్చులు రూ.3,000
మొత్తం రూ.22,300
కై లాస్‌నగర్: ప్రస్తుత పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి కుటుంబ జీవనం ఆర్థిక సుడిగుండాల్లో కొట్టుమిట్టాడుతుంది. ముఖ్యంగా ప్రైవేట్ చిరుద్యోగుల పరిస్థితి వర్ణనాతీతం. ఆదాయం గొరంత.. ఖర్చులు కొండంతలా పెరిగిపోతున్నాయి. నెల గడవడం కష్టతరంగా మారుతోంది. వచ్చే జీతం సరిపోక అ ప్పులు చేయాల్సిన దుస్థితి. ఈ క్రమంలో పలువురు సెకండ్ ఇన్‌కంపై దృష్టి సారిస్తున్నారు. తీరిక సమయాలు, సెలవురోజుల్లో తమకు అనుకూలమైన పనులు నిర్వహిస్తూ కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చేలా ముందుకు సాగుతున్నారు.
చాలీచాలని వేతనాలు..
జిల్లాలో చాలా మంది డిగ్రీ, పీజీలు చది విన వారున్నారు. సర్కారు కొలు వులు రాక ఉపాధి నిమిత్తం ప్రైవేట్‌లో పని చేస్తున్నారు. విద్యాసంస్థలు, చిట్‌ఫండ్ కంపెనీ లు, బ్యాంకులు ఇతరత్రా రంగాల్లో చిరుద్యోగులుగా కొనసాగుతున్నారు. వీరికి నెలకు రూ.10వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం అందుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది ఏమాత్రం సరిపోవడం లేదు. భార్య, భర్త, ఇద్దరు పిల్లలున్న కుటుంబంలో నెల గడవాలంటే రూ.20వేల నుంచి రూ.25వేలు అవసరం. అది కూడా పరిమితికిలోబడి ఖర్చుచేస్తేనే. అనుకోకుండా వచ్చే వైద్యఖర్చులు, విహారయాత్రలు, వినోదాల కోసం ఆలోచిస్తే అప్పులు తప్పవు. వీరికి పొదుపు ఆమడ దూరమని చెప్పవచ్చు. ఈ క్రమంలో కొందరు ఆచీ తూచి వ్యహరిస్తూ సర్దుకుపోతుండగా.. మరికొందరు సెకండ్ ఇన్‌కంపై దృష్టి సారిస్తున్నారు.
అదనపు ఆదాయంపై ఆసక్తి
ప్రైవేట్ చిరుద్యోగులు తీరిక వేళలు, సెలవురోజుల్లో ఇతర పనులు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్, ఆన్‌లైన్ జాబ్స్, ట్యూషన్లు, మార్కెటింగ్, ర్యాపిడో వంటి వాటిపై దృష్టి సారిస్తున్నారు. భర్తకు తోడుగా భార్య స్టిచ్చింగ్, కిరాణ షాపు, మగ్గం వర్క్ వంటివి చేస్తూ కుటుంబానికి చేదోడుగా నిలుస్తున్నారు. పిల్లల చదువు, ఆనుకోకుండా వచ్చే వైద్య ఖర్చులు, పొదుపు వంటి వాటిపై దృష్టి సారిస్తున్నారు. ఆర్థిక అవసరాలు అధిగమించేలా చూసుకుంటున్నారు.
● ప్రైవేట్‌లో చాలీచాలని వేతనాలు ● పేద, మధ్యతరగతి కుటుంబ
● ప్రైవేట్‌లో చాలీచాలని వేతనాలు ● పేద, మధ్యతరగతి కుటుంబ


